మెగా ప్రిన్సెస్ : ప్రేమతో ఇచ్చిన ఆ చెక్క ఊయలా లేక బంగారం ఊయలా..

మెగా ప్రిన్సెస్ : ప్రేమతో ఇచ్చిన ఆ చెక్క ఊయలా లేక బంగారం ఊయలా..

మెగా ఫ్యాన్స్ పండుగ రోజు.. మెగా ప్రిన్సెస్ ఊయల, బారసాల ఫంక్షన్ జరుగుతుంది. దీంతో పాప పేరు ఏంటీ అనేది ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. అదే విధంగా మెగా ప్రిన్సెస్ ను బంగారం ఊయలలో వేస్తున్నారని.. ఈ బంగారు ఊయల అంబానీ పంపించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగారం ఊయల విషయంలో భిన్న వార్తలు, భిన్నాభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. 

ఉపాసన డెలివరీ కంటే ముందే.. ఓ ఊయలను బహుమతిగా ఉందుకున్నారు. ఆ ఊయలపై ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు. అది చెక్క ఊయల.. ఎలాంటి మిషనరీ లేకుండా కేవలం మహిళలు మాత్రమే.. చేతులతో తయారు చేసిన ఊయల అది. ఎంతో ప్రేమతో.. ప్రేమగా.. అపురూపంగా.. ఆప్యాయంగా తయారు చేసిన ఆ చెక్క ఊయలలోనే ఇప్పుడు మెగా ప్రిన్సెస్ ను ఉంచబోతున్నట్లు చెర్రీ అప్తులు, ఫ్యాన్స్ అంటున్నారు.

రాంచరణ్, ఉపాసన ఎన్నో స్వచ్చంధ సంస్థలకు నిధులు ఇస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ప్రజ్వల ఫౌండేషన్ ఒకటి. ఆ ఫౌండేషన్ లో అందరూ మహిళలే.. సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుని దీన స్థితి అనుభవిస్తున్న వారిని కాపాడి.. వారికి స్వయం ఉపాధి కల్పించటం.. వారి పిల్లల చదువు బాధ్యతను చూడటం ప్రజ్వల ఫౌండేషన్ విధి. ఆ ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తుంది ఉపాసన.

ఉపాసన గర్భవతి అని తెలిసిన వెంటనే.. ఫౌండేషన్ లోని మహిళలు.. స్వయంగా చెక్కలు సేకరించి.. వాటిని చేతితో కట్ చేసి.. ఎలాంటి మిషనరీ సాయం లేకుండా ఊయలను తయారు చేసి.. ఉపాసనకు బహుమతిగా పంపారు. ఊయలను బహుమతిగా అందుకున్న ఉసాసన అప్పట్లోనే స్పందించారు.. 

ఈ ఊయల బలం, ఆత్మగౌరవం, ఆశకి ప్రతీకగా.. తన బిడ్డకు గుర్తుండి పోతుంది అని ఉపాసన సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రేమతో పంపిన గిఫ్ట్ కావడంతో ఉపాసన ఎంతో సంతోషంగా ఊయలని తీసుకుని.. ఆ ఫొటోలను సైతం షేర్ చేశారు.

ఇప్పుడు ఆ ఊయలలోనే మెగా ప్రిన్సెస్ బారసాల ఫంక్షన్ జరగబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా అంబానీ పంపినట్లు చెబుతున్న బంగారు ఊయలలో మెగా ప్రిన్సెస్ ఊగుతారా లేక ప్రేమానురాగాలతో మహిళలు పంపిన పంపిన చెక్కు ఊయలలో ఊగుతారా అనేది ఫొటోలు బయటకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఇదే ఆసక్తి నెలకొంది.