అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్స్ షురూ

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్స్  షురూ

నేటి నుంచి ఆగస్టు 12 వరకు డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు 
​హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్​ నోటిఫికేషన్​ మంగళవారం రిలీజైంది. ఈనెల 23 నుంచి ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్లు సూచించారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు క్వాలిఫికేషన్స్, ఫీజు ఇతర వివరాలకు www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్లను చూడాలని కోరారు. 2020-–21లో ఫస్టియర్​ అడ్మిషన్​ పొందిన స్టూడెంట్లు, సెకండియర్​ ట్యూషన్​ ఫీజును ఆగస్టు12లోగా చెల్లించాలని తెలిపారు. 2012-–13 ఇయర్​ నుంచి 2020-–21 వరకు అడ్మిషన్ పొంది ఉంటే ట్యూషన్​ ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570/580, లేదా 040-23680290/291/294/295కు కాల్​ చేయాలని సూచించారు.