ఇవాళ(జూన్ 13) తాళ్లకుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ... హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇవాళ(జూన్ 13) తాళ్లకుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ... హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     ఏర్పాట్లను పరిశీలించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మధుబాబు

కేతేపల్లి( నకిరేకల్), వెలుగు:  నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. కార్యక్రమ ఏర్పాట్లను మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటస్వామి కూడా హాజరుకానున్నట్లు చెప్పారు.  ఉమ్మడి నల్గొండ జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, తాళ్లకుంట గ్రామ శాఖ అధ్యక్షుడు పట్టేటి సైదులు, విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు దోసలి సైదులు, పట్టేటి వెంకన్న తదితరులు  పాల్గొన్నారు.