కూల్చిన చోటే అంబేద్కర్ విగ్రహం పెట్టాలి : ధర్నాచౌక్ లో వక్తలు

కూల్చిన చోటే అంబేద్కర్ విగ్రహం పెట్టాలి : ధర్నాచౌక్ లో వక్తలు
  • అంబేద్కర్ కు కేసీఆర్ ఎప్పుడు దండకూడా వేయలేదు

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం జరిగిందన్నారు పలు పార్టీల నేతలు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలిగించిన దగ్గరే…ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి… చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో అంబేద్కర్ వాదులు మహాగర్జన నిర్వహించారు. దీనికి పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

మంద కృష్ణ మాదిగ, mrps జాతీయ అధ్యక్షుడు…

సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అన్నారు mrps జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. కేసీఆర్ దళితులను మోసం చేస్తే mrps చూస్తూ ఉరుకోదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు… కూల్చడానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్  అంబేద్కర్, బాబూ జగ్జీవన్ జయంతిలలో ఎప్పుడు పాల్గొనలేదని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం పక్కకు ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చకుండా అంబేద్కర్ విగ్రహం ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలన్నారు. నీ ప్రభుత్వాన్ని కూడా చెత్త కుప్పలో వేసే వరకు మేము పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల వివక్షతో ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ తన సొంత ఊరిలో కూడా ఎప్పుడూ అంబేద్కర్ కు దండ వేయలేదన్నారు.

18 కిలోమీటర్ లో ఉన్న  బాపు ఘాట్ లో గాంధీకి నివాళి అర్పించే కేసీఆర్.. కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు రారని ప్రశ్నించారు. గతంలో TRS  భవన్ లో అంబేద్కర్ బొమ్మ ఉండేదని…ఇప్పుడు కేసీఆర్ బొమ్మ ఉందన్నారు. ప్రణబ్ ముఖర్జీ కి పాదాభివందనం చేసిన కేసీఆర్..రామ్ నాధ్ కొవింద్ దళితుడు కాబట్టి ఆయనకు పాదాభివందనం చేయలేదన్నారు. అంతేకాదు అవినీతి చేసాడని రాజయ్యను బర్తరఫ్ చేశారు..కాని రాజయ్య చేసిన అవినీతిని నిరూపించలేక పోయారన్నారు. అదే 26 మంది విద్యార్థుల చావుకు కారణం అయిన మంత్రి జగదీష్ రెడ్డిని ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదన్నారు. న్యాయ వ్యవస్థ మీద  నమ్మకం ఉందన్న మందకృష్ణ మాదిగ.. 20వ తేది లోపు రాష్ట్రపతిని, గవర్నర్, జాతీయ SC,ST కమిషన్ చైర్మన్  కలుస్తాన్నారు. దీనికి ప్రభుత్వం స్పందించక పోతే రాజకీయ పోరాటం చేయడాని కూడా తాము రెడీ అవుతామన్నారు.

JB రాజు, దళిత హక్కుల నేత…

సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ పై అసలు గౌరవం లేదన్నారు దళిత హక్కుల నేత Jb రాజు.  అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దగ్గరే ఆయన  కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. అంతేకాదు ఆయన విగ్రహం ముందుకు వచ్చి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. SC,ST అట్రాసిటి యాక్ట్  కూడా ఉద్యమం చేయడంతోనే కాపాడుకోగలిగామన్నారు.

చెరకు సుధాకర్,తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు….

కేసీఆర్ హామీ  ఇచ్చిన 125 అడుగుల విగ్రహం పెట్టకుండా..నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం పలగగొట్టి చెత్త కుప్ప లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెరుకు సుధాకర్. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు….

అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడమేనన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఆయన విగ్రహాన్ని కూల్చడమంటేనే.. ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో తెలుస్తోందన్నారు. నిరసన తెలిపితే కూడా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మీద కాదు  నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగానే మనం పోరాటం చేస్తున్నామన్నారు.

హనుమంత రావు, కాంగ్రెస్ నేత…

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే తెలంగాణ వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు. కేసీఆర్ కు అహంకారము పెరిగిందని.. ఇంటర్ విద్యార్థులు చనిపోతే కనీసం మాట్లాడలేదని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయక పోతే తాను కూడా నిరవధిక దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.

చాడ వెంకట్ రెడ్డి ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

హక్కులు కాలరాసేలా కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం అక్కడ పెట్టకపోతే..తామే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పోరాటాల ద్వారానే ఏదయినా సాధించవచ్చన్న చాడ..కేసీఆర్ దళిత మోసగాడు అన్నారు.

పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ…

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అంటే..అది ఆయనకు జరిగిన అవమానం కాదు మొత్తం  SC,ST,BC, బీసీలను అవమనించడమేనన్నారు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయని  సీఎం కేసీఆర్ ఒక్కడేనన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం కాకుండా కల్వకుంట్ల వంశం కోసమే పనిచేస్తారన్నారు. అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాజెక్టు పేరు కూడా మార్చారని ఆరోపించారు పొన్నాల.

రమణ, టీటీడీపీ అధ్యక్షుడు..

ఓటు అనే ఆయుధం ను తీసుకువచ్చిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. అంతటి మహనీయుడి విగ్రహాని కూల్చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. పోలీస్ ల పహారా లో మహా గర్జన జరగడం దారుణమన్నారు.

రాం చందర్ రావు, బీజేపీ MLC…

అంబేద్కర్ ఏ ఒక్క కులానికి చెందిన నాయకుడు కాదన్నారు బీజేపీ నేత రాం చందర్ రావు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం దారుణమన్నారు.  దీనికి నిరసన తెలిపిన వారిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Mrps చేసే భవిష్యత్ ఉద్యమానికి మద్దతు ఉంటుందన్నారు.

విమలక్క, అరుణోదయ సమాఖ్య అధ్యక్షులు….

అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం దారుణమని.. కూల్చిన దగ్గరే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు విమలక్క.  లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అద్దంకి దయాకర్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి…

కేసీఆర్ లాంటి పనికిమాలిన వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడరు..అసలు కేసీఆర్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతికత లేదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. భవిష్యత్ లో కేసీఆర్ ను  రాజకీయ సమాధి చేసేది అంబేద్కర్ వాదులేనన్నారు. ఎన్నికల మీద ఉన్న యావ…ఇంటర్ బోర్డు తప్పిదాలతో చనిపోయిన విద్యార్థుల మీద లేదని ఆరోపించారు. అంబేద్కర్ బొమ్మ ఉండాల్సింది ఇంట్లో కాదు.. గుండెల్లో ఉండాలన్నారు.

ఫిరోజ్ ఖాన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు...

రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు అవమానం జరిగింన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. మహారాష్ట్ర లో జై భీం అని చెప్పిన అసద్ తెలంగాణ లో అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

బ్రహ్మయ్య. ఏపీ mrps అధ్యక్షుడు.

అంబేద్రర్  విగ్రహాన్ని కూల్చివేస్తే  సీఎం కేసీఆర్ మాట్లాడక పోవడం దారుణమన్నారు ఏపీ mrps అధ్యక్షుడు బ్రహ్మయ్య.

జాజుల శ్రీనివాస్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు…

టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. పూలే జయంతి కి కేసీఆర్ ఎప్పుడు రాలేదన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.  దళిత బహుజనులు చనిపోయినా ఎప్పుడు కేసీఆర్ రాలేదు. కానీ తాగి చనిపోయిన నారాయణ కొడుకు శవం దగ్గరకి, హరికృష్ణ శవం దగ్గరకి కేసీఆర్ వెళ్ళారని ఆరోపించారు. దొరల రాజ్యాన్ని ఎదిరించడానికి ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు.