అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయండి : ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయండి :  ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం

గోదావరిఖని, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం లీడర్లు కోరారు. శుక్రవారం రామగుండం సీపీ అంబర్​కిశోర్ ఝాను కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ పోలీస్​స్టేషన్ల పరిధిలో కులం పేరుతో దూషించిన సందర్భాలలో బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని, కాలయాపన చేస్తున్నారని తెలిపారు. 

అనంతరం సీపీని సన్మానించారు. నాయకులు మామిడిపల్లి బాపయ్య, బొంకూరి మధు, మైస రాజేశ్, లింగమల్ల శంకరయ్య, బచ్చలి రాజయ్య, అరికిల్ల రామలక్ష్మి, రామిళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి

ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోపాటు ఇతరులకు అవగాహన కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కోరారు. ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్​ ఆఫీస్​లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సహకారం అందించాలన్నారు.

అనంతరం మున్సిపల్​ఉద్యోగులకు అడిషనల్ కలెక్టర్, కమిషనర్​అరుణశ్రీతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ట్రాఫిక్​ఏసీపీ శ్రీనివాస్, ఏసీపీ కృష్ణ, గవర్నమెంట్ హాస్పిటల్​ ఆర్​ఎంవో డాక్టర్​ కృపాభాయ్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, ట్రాఫిక్​సీఐ రాజేశ్వర్​రావు  పాల్గొన్నారు.