ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరగాలె

ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరగాలె
  •     ఈనెల 20, 21న స్పెషల్ క్యాంపెయిన్ 
  •      కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ఈనెల 6న ఓటర్ డ్రాఫ్ట్ జాబితా ప్రచురితమైందని, క్లెయిమ్స్​, అభ్యంతరాలకు ఈనెల 22 వరకు అవకాశం ఉందన్నారు.

మార్పులు, చేర్పులకు ఫారం 8 ద్వారా అప్లై చేసుకోవాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ స్థాయిలో ఏజెంట్లను నియమించుకోవాలని, ఈనెల 20, 21న అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తామని  తెలిపారు. 

రిపబ్లిక్​డే వేడుకలకుఏర్పాట్లు చేయాలె

రిపబ్లిక్​డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆఫీసులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రిపబ్లిక్​ డే వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల యాజమాన్యాలు జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను అందించి సహకరించాలన్నారు.

కలెక్టర్లకు సన్మాన సభ

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన కలెక్టర్​శరత్, కొత్త కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​శరత్ మాట్లాడుతూ గతంలో ఉద్యోగులు తనకు అందించిన సహాయ సహకారాలను ప్రస్తుత కలెక్టర్​కు కూడా అందించాలని కోరారు. నూతన కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు కష్టపడి పనిచేసి జిల్లాకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాములు,  జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు సురేశ్ మోహన్, మైపాల్ రెడ్డి, మన్నె కిరణ్, గంగాధర్ రావు, దశరథ్, పరమేశం, కార్తీక్ కుమార్, వీరేశం, బాలరాజ్ , ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.