బీరుట్: సిరియాపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 37 మంది మిలిటెంట్లు హతమయ్యారు. చనిపోయిన వాళ్లంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ కాయిదా ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చెందినవారేనని అమెరికా మిలిటరీ ఆదివారం తెలిపింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అలాగే, అల్ కాయిదా అనుబంధ సంస్థ హుర్రాస్ అల్ దీన్, మరో ఎనిమిది టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఓ సీనియర్ మిలిటెంట్ ను లక్ష్యంగా చేసుకొని ఈ నెల 24న కూడా ఈశాన్య సిరియాపై దాడి చేశామని యూఎస్ మిలిటరీ వెల్లడించింది. ఈ నెల 16న కూడా సెంట్రల్ సిరియాలోని ఓ మారుమూల ప్రాంతంలో నిర్వహిస్తున్న ఐఎస్ ట్రైనింగ్ క్యాంపు మీదా మరో భీకర దాడి చేశామని చెప్పింది. ఆ అటాక్ లో 28 మంది మిలిటెంట్లు చనిపోయారని, వారిలో నలుగురు సీనియర్ లీడర్లు ఉన్నారని పేర్కొంది.