అమెరికా ఆరోపణలపై ఆధారాలు కోరిన WHO

అమెరికా ఆరోపణలపై ఆధారాలు కోరిన WHO
  • ఇప్పటివరకు ఆధారాలేమీ ఇవ్వలేదన్న డబ్ల్యూహెచ్ఓ

జెనీవా : కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పిన అమెరికా ఇప్పటి వరకు తమకు వాటిని ఇవ్వలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అమెరికా వద్ద ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్న వాటిని తీసుకొని విశ్లేషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ చీఫ్ మైకేల్ ర్యాన్ తెలిపారు. అమెరికా చేస్తున్న ఆరోపణాలన్నీ కూడా వారి అనుమానాలు మాత్రమేనని తాము భావిస్తున్నామని ర్యాన్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటంలో చైనా సహా డబ్ల్యూహెచ్ఓ విఫలమైందంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇటీవల వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టినట్లు ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్ఓ మాత్రం అమెరికా ఆరోపణలన్నీ అనుమానాలు మాత్రమేనని వ్యాఖ్యనించటం ఆసక్తి రేపుతోంది. డబ్ల్యూహెచ్ఓ కు సేకరించిన డేటా, ఆధారాల ప్రకారం వైరస్ నేచురల్ గా పుట్టినట్లు తేలిదంని ర్యాన్ చెప్పారు. వైరస్ ఓ జీవి నుంచి మొదట పుట్టిందో తెలుసుకునేందుకు చైనా సైంటిస్టులు ప్రపంచంలో కలిసి పనిచేస్తున్నారని ఇలాంటి సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు సరికాదని డబ్యూహెచ్ఓ తెలిపింది. అమెరికా మాత్రం కరోనా వ్యాప్తి చైనా, డబ్ల్యూహెచ్ఓ నిర్లక్ష్యమే కారణమంటూ విచారణ కూడా ప్రారంభించింది.