చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన యూఎస్

చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన యూఎస్

వాషింగ్టన్ : చైనాకు చెందిన 33 కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. డ్రాగన్ కంట్రీ మైనార్టీల పట్ల వ్యవహారిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని అణిచివేసేందుకు, వారిపై నిఘా పెట్టేందుకు ఈ 33 కంపెనీలు పనిచేస్తున్నాయని ఆరోపించింది. మైనార్టీ హక్కులకు భంగం కలిగిస్తున్నారన్న కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్గర్ల అనే ఓ తెగను సామూహికంగా నిర్భందించటం, శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆయా కంపెనీలకు చైనా మిలటరీతో సంబంధాలున్నాయని అమెరికా ఆరోపించింది. అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన చైనా కంపెనీల్లో 7 టెక్నాలజీకి కి సంబంధించినవే ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ లో చేర్చిన అన్ని కంపెనీలకు నిధులు రాకుండా చేసింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి కారణంతోనే 28 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసింది.