ఈ ఏడాది మనోళ్లకు 10 లక్షల అమెరికా వీసాలు

ఈ ఏడాది మనోళ్లకు 10 లక్షల అమెరికా వీసాలు

వాషింగ్టన్: మనోళ్లకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్లకు ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. గత కొంతకాలంగా ఇండియాలోని తమ కాన్సుల్ జనరల్ ఆఫీసుల్లో వీసాల జారీకి ఎక్కువ టైమ్ పడుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ‘‘ఇండియన్లకు ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేయాలని నిర్ణయించాం. అందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్టూడెంట్ వీసాలను త్వరగా ప్రాసెస్ చేసి, వాళ్లు సకాలంలో కాలేజీల్లో చేరేలా చూస్తాం.

అలాగే వర్క్ వీసాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం హెచ్1బీ, ఎల్ వీసాలకు వెయిటింగ్ టైమ్ 60 రోజుల కంటే తక్కువే ఉంది. వర్క్ వీసాల జారీని మరింత వేగవంతం వేస్తాం. ఇది ఇరు దేశాల ఎకానమీకి ఎంతో ముఖ్యం” అని ఓ ఇంటర్వ్యూలో అమెరికా అధికారి డొనాల్డ్ తెలిపారు. త్వరలోనే డొమెస్టిక్ వీసా రెన్యూవల్ సర్వీస్ ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘ఇండియా, అమెరికా మధ్య బలమైన బంధం ఉంది. రెండు దేశాల మధ్య లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. లక్ష మందికి పైగా అమెరికన్లు ఇండియాలో ఉన్నారు” అని పేర్కొన్నారు.