టెక్సాస్​లో బిజినెస్ లు రీ ఓపెన్

టెక్సాస్​లో బిజినెస్ లు రీ ఓపెన్

హోస్టన్/ కౌలాలంపూర్​నెల రోజుల లాక్​డౌన్​ తర్వాత అమెరికాలోని రెండో పెద్ద స్టేట్​ టెక్సాస్​లో చిన్నచిన్న బిజినెస్​లు రీ ఓపెన్​ అయ్యాయి. తక్కువ ఆక్యుపెన్సీతో నడిచే వ్యాపారాలను నడిపించుకునేందుకు అక్కడి అధికారులు పర్మిషన్స్​ ఇచ్చారు. దీంతో పలు రోడ్లు, షాపులు జనాలతో సందడిగా కన్పించాయి. టెక్సాస్​లో శుక్రవారం నాటికి 29 వేల మందికి కరోనా సోకగా 820 మంది వరకు చనిపోయారు. ఏప్రిల్​ 4వ తేదీ నుంచి టెక్సాస్​లో లాక్​డౌన్​ నడుస్తోంది. గురువారం రాత్రి నుంచి లాక్​డౌన్​ ఎత్తేయడంతో రిటైల్​ షాప్స్​, రెస్టారెంట్స్​, థియేటర్లు, మాల్స్​, లైబ్రరీలు, మ్యూజియమ్స్​ను 25 శాతం ఆక్యుపెన్సీతో తెరిచారు. రెండు మూడు ఫేజ్​లలో లాక్​డౌన్​ను పూర్తిగా ఎత్తివేస్తామని, ఫస్ట్​ ఫేజ్​రిలాక్సేషన్స్​ తర్వాత పరిస్థితుల్ని అంచనా వేసి సెకండ్​ ఫేజ్​గురించి ఆలోచన చేస్తామని టెక్సాస్​ గవర్నర్​ గ్రీజ్​ అబోట్​వెల్లడించారు.

కాలిఫోర్నియాలో బీచ్​లు క్లోజ్​

లాక్​డౌన్​ ఉన్నప్పటికీ కాలిఫోర్నియాలోని పలు బీచ్​ల్లో ఇంకా జనం తిరుగుతూనే ఉన్నారు. పోయిన వీకెండ్​లో జనం బీచ్​లకు భారీగా తరలిరావడంతో వాళ్లను నిలువరించడం పోలీసులకూ కష్టమైంది. దీంతో కొన్ని రోజులపాటు బీచ్​లను పూర్తిగా మూసివేయాలని కాలిఫోర్నియా గవర్నర్​ గవిన్​న్యూసన్​ నిర్ణయం తీసుకున్నారు.

సడలింపులకు మలేషియా రెడీ

లాక్​డౌన్​లో మేజర్​సడలింపులు ఇచ్చేందుకు మలేషియా సైతం రెడీ అవుతోంది. కొన్ని కండీషన్స్​తో బిజినెస్​ పాయింట్లు, ఇండస్ట్రీస్​ను రీ ఓపెన్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. మార్చి 18 నుంచి మలేషియాలో లాక్​డౌన్​ నడుస్తోంది. ఇటీవల అక్కడ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రిలాక్సేషన్స్​ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందు తీసుకున్న నిర్ణయం మేరకు మే 12 తేదీ వరకు లాక్​డౌన్​ కొనసాగాల్సి ఉంది. కానీ అంతకు ముందే స్మాల్​ బిజినెస్​లు, రెస్టారెంట్స్​ ఓపెన్​ చేయాలని నిర్ణయించారు. కస్టమర్లకు, స్టాఫ్​కు టెంపరేచర్​ స్క్రీనింగ్ చేయాలని, షాప్​కు వచ్చే వాళ్ల డిటైల్స్​ తీసుకోవాలని షరతులు పెట్టారు.