తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు

తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు

అఫ్ఘాన్​లో హింసకు ఫుల్​స్టాప్​ పెట్టడానికి అమెరికా మూడేళ్ళుగా ప్రయత్నిస్తోంది. తాలిబన్లతో రెగ్యులర్​గా చర్చలు జరుపుతోంది. టెర్రరిస్టులు రోజూ దాడులకు పాల్పడుతూ అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నా సంప్రదింపుల ప్రక్రియను మాత్రం అగ్రరాజ్యం విడిచిపెట్టలేదు. చొరబాటుదారులు అఫ్ఘాన్​ను ఆక్రమిస్తుంటే గట్టిగా అడ్డుకుంటూ అంతర్జాతీయంగా సపోర్ట్​ కూడగట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ‘రిడక్షన్​ ఇన్​ వయొలెన్స్ (ఆర్​ఐవీ)’ అనే కొత్త పరీక్షకు సిద్ధమైంది. దీనికి తాలిబన్లూ సై అనేలా చేసింది.

ఒక వైపు బాంబుల మోతలు… మరో వైపు చావు వార్తలు! నలభై ఏళ్లకు పైగా అన్నివిధాలా నష్టపోయిన అఫ్ఘానిస్థాన్​లో ఇక కొత్త చరిత్ర మొదలుకానుందా? నిత్యం జరుగుతున్న యుద్ధం, మిలిటెంట్ల కార్యకలాపాలు, ఇతర దేశాల దాడులకు ఈవాళ్టితో ఫుల్​ స్టాప్​ పడనుందా? ఈ రెండు ప్రశ్నలకు అఫ్ఘాన్​–అమెరికా​, తాలిబన్​ బలగాల మధ్య కుదరనున్న శాంతి ఒప్పందం ఎండ్​కార్డ్​ వేయబోతోంది.

అప్పుడెప్పుడో 1970ల్లో మొదలుకొని నిన్న మొన్నటి వరకు అమెరికా, రష్యా కోల్డ్​వార్​లో చిక్కుకొని విలవిల్లాడింది అఫ్ఘానిస్థాన్. ఇప్పుడిక వయొలెన్స్​కి ఎండ్​ కార్డ్​ వేయటానికి అమెరికా ముందుకొచ్చింది. నిత్యం చికాకు పెడుతున్న తాలిబన్​తో​ ఇవాళ (29న) అఫ్ఘాన్​–అమెరికాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు దిగకుండా ఎంతవరకు సైలెంట్​గా ఉంటామో సెల్ఫ్​ టెస్ట్​ చేసుకున్నాయి. ఏడు రోజుల పరీక్షలో అటు ప్రభుత్వమూ, ఇటు తాలిబన్​ సైన్యాలు సైలెంట్​గా ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ శుక్రవారంతో మొదలైన పరీక్ష 28వ తేదీ శుక్రవారం వరకు సాగింది. ఈ సెల్ఫ్​ టెస్టులో రెండు వర్గాలూ పాసయ్యాయని ఇంటర్నేషనల్​ ఎక్స్​పర్ట్​లు గుర్తించారు.

ఏడాదికి పైగా నడిచిన చర్యల తర్వాత ఒప్పందానికి రెండు వర్గాలు ఒప్పుకోవటం మంచి విషయంగా చెబుతున్నారు. ఇక అఫ్ఘానిస్థాన్​లో పొలిటికల్​ సెటిల్​మెంట్​ కుదరాల్సి ఉంది. దీనికోసం రెండు దేశాలూ ఏర్పాట్లు చేస్తాయి. ఖైదీలను విడుదల చేస్తాయి. అఫ్ఘాన్​ని అమెరికా ఆర్మీ వదిలి వెళుతుంది. ఇంటర్నేషనల్​ పరిశీలకుల ఆధ్వర్యంలో ఒప్పందంపై సంతకాలు జరిగితే ఇవన్నీ చకచకా జరుగుతాయి.

20 ఏళ్లుగా అమెరికా అండ

2001 సెప్టెంబర్​ 11న ట్విన్​ టవర్స్​పై టెర్రరిస్టులు ఎటాక్​ చేయటంతో అమెరికా రంగంలో దిగింది.  అఫ్ఘానిస్థాన్​లోని అల్-ఖైదా ట్రైనింగ్​ సెంటర్లు లేకుండా చేయాలని టార్గెట్​ పెట్టుకుంది. అల్​ఖైదా సంస్థ చీఫ్​ ఒసామా బిన్-లాడెన్‌ని అప్పగించకపోతే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని హెచ్చరించింది. అప్పటి నుంచి 19 ఏళ్లుగా అమెరికా సైన్యం అక్కడే ఉండిపోయింది. తాలిబన్లతో ఒప్పందం కుదిరితే రేపో మాపో సొంత దేశం తిరిగి వెళ్లిపోతుంది. ఈ సందర్భం కోసమే ఎదురుచూస్తున్నామని యూఎస్​ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కూడా అన్నారు.

కాల్పుల విరమణ?

ఆర్​ఐవీ టెస్ట్​ సక్సెస్​ కావటంతో ఈ విధానాన్ని మరింత కాలం కొనసాగిస్తారు. కాల్పుల విరమణకు, వివిధ​ గ్రూప్​ల మధ్య చర్చలకు వీలు ఏర్పడుతుందని

అఫ్ఘాన్​ నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్​ జావిద్​ ఫైజల్​ అన్నారు. ఆర్​ఐవీ పీరియడ్​ను ‘సీజ్​ ఫైర్​ ’గా భావించొద్దని ఓ తాలిబన్​ లీడర్​ అన్నారు. సెల్ఫ్​ డిఫెన్స్​ అనేది ప్రతి వర్గానికీ ఉండే హక్కేనని, దాని ప్రకారం ఈ ఏడు రోజులు మాత్రమే ప్రత్యర్థిపై దాడులు చేయబోమని క్లియర్​గా చెప్పారు. దీన్నిబట్టి ఫ్యూచర్​లో దాడులకు దిగబోమనే కండిషన్​కి తాలిబన్లు సరేనంటారా లేదా అనే డౌటొస్తోంది. అయితే, ఒప్పందం తర్వాత అఫ్ఘానిస్థాన్​లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అమెరికా అంచనా వేస్తోంది. మొదట్లో ‘అఫ్ఘాన్​ మిలటరీ యూఎస్​ చేతిలో కీలుబొమ్మ’ అన్న ఉద్దేశంతో తాలిబన్లు చర్చలకు ఇష్టపడలేదు. చివరికి వాళ్లు ఆ ఫీలింగ్​ నుంచి బయటకు వచ్చినట్లు సంప్రదింపులను బట్టి అర్థం చేసుకోవచ్చు.