మా వాళ్లను ఇబ్బంది పెట్టారో.. ఖబడ్దార్

మా వాళ్లను ఇబ్బంది పెట్టారో.. ఖబడ్దార్

అమెరికాను చైనా దోచేస్తుంది
ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనా?
డ్రాగన్ కంట్రీపై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్
నా హయాంలో ఇకపై అలా జరగనివ్వను
లాక్డౌన్ త్వరగా ఎత్తేయాలనే కోరుకుంటున్నా
సరైన టైంలో నిర్ణయం: ట్రంప్‌

వాషింగ్టన్, న్యూయార్క్: చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించాలని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశం పేరిట అమెరికాను చైనా కొల్లగొట్టిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికాను కరోనా ఆగం చేస్తుండటంతో చైనాపై ట్రంప్ అసహనంతో ఉన్నారు. శుక్రవారం వైట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న దేశంహోదాను దాటేసినా చైనా ఇప్పటికీ ఆ ప్రయోజనాలను పొందుతోందని ట్రంప్ విమర్శించారు. అమెరికా సపోర్ట్ తోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీఓ)లో చైనా చేరి గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు. తన పాలనలో ఇలా జరగటాన్ని అనుమతించనని చెప్పారు. తాను అధికారంలో వచ్చాక చైనా ఉత్పత్తులపై విధించిన పన్నులతో దేశానికి వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. విదేశాల్లో చిక్కుకున్న అమెరికన్లను స్వదేశానికి రానివ్వని దేశాలకు వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని హెచ్చరించారు. ‘అమెరికా ఎకానమీని ఈ వైరస్ ధ్వంసంచేసింది. దేశంలో లాక్ డౌన్ ఎత్తేయడమే నా జీవితంలో తీసుకోనున్న అతిపెద్ద నిర్ణయం. సరైన సమయంలో లాక్ డౌన్ ఎత్తేస్తాం..’ అని అన్నారు. వీలైనంత త్వరగా దేశం తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు, కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ట్రావెల్‌‌‌‌ రెస్ట్రిక్షన్స్‌ వల్ల అమెరికాలో నిలిచిపోయిన మన వాళ్ల హెచ్‌ 1బీ వీసాల గడువును పొడిగించాలని మన దేశం చేసిన రిక్వెస్ట్‌‌‌‌ను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

కాంట్రాక్ట్ వర్కర్లే ఖననం చేస్తున్నారు
కరోనా విజృంభనతో అమెరికాలోని న్యూయార్క్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మారి కారణంగా రోజూ వందలాది మంది చనిపోతుండటంతో మృతదేహాలను ఖననం చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో టెంపరరీ బేసిస్ లో శవాలను పూడ్చేందుకు అధికారులు కాంట్రాక్ట్ వర్కర్స్ ను నియమించారు. కరోనాతో చనిపోయిన వారిని ఈ వర్కర్లే ఖనన చేస్తున్నారు.

పాలు పారబోస్తున్నరు
కరోనా విపత్తు వల్ల అమెరికా రైతులు గోస పడుతున్నరు. చిన్న రైతులకు రోజురోజుకూ కష్టాలు తీవ్రమవుతున్నాయి. లాక్ డౌన్ ల వల్ల దేశవ్యాప్తంగా సప్లై చైన్లు తెగిపోయాయి. సూపర్ మార్కెట్లు, షాపులు, రెస్టారెంట్లు, కాఫీ హోటళ్ల వంటివన్నీమూతపడటంతో బీఫ్, కూరగాయలు, పాల ఉత్పత్తులను కొనేవారే కరువయ్యారు. డైరీ ఫాంలు నడుపుతున్న రైతులు పాలను పొలాల్లోనే పారబోస్తున్నారు. బీఫ్ కు ఉపయోగించే పశువుల ధరలు 30శాతం పడిపోయాయి.

20 వేలు దాటిన మరణాలు
మరణాల్లోనూ అమెరికా టాప్లోకి వచ్చింది. డెత్ల సంఖ్య 20,135కు చేరుకుంది. ఒక్కరోజులో 2,108 మంది చనిపోయారు. ఇప్పటిదాకా ఇదే రికార్డ్. 3 రోజులుగా రోజూ 2 వేల మందికిపైగా బలవుతున్నారు. కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొత్తంగా దేశంలో 5,21,000 మంది వైరస్ బారిన పడ్డారు.

For More News..

13,567 వెహికల్స్ సీజ్.. మరి అవన్నీ ఇచ్చేది ఎప్పుడో తెలుసా..

ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..