హైదరాబాద్, వెలుగు: సిటీలోని జనరల్ నానక్ రామ్‌గూడలో నిర్మించిన కొత్త ఆఫీసులో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించింది. 340 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీనిని నిర్మించామని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. ఈ కొత్త కాన్సులేట్ వల్ల ఇండియాతో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని కామెంట్ చేశారు. రెండుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వీసా ఆఫీసర్ల సంఖ్యను, ఇతర స్టాఫ్‌ను పెంచుతామని చెప్పారు. పోయిన ఏడాది 18 వేలకుపైగా స్టూడెంట్ వీసాలను జారీ చేశామని అన్నారు.
