మళ్లీ అమ్మనవుతా

మళ్లీ అమ్మనవుతా

న్యూయార్క్: తన ఆటతో విమెన్స్‌‌ టెన్నిస్‌‌కే కళ తెచ్చిన అమెరికా లెజెండ్‌‌ సెరెనా విలియమ్స్‌‌ కెరీర్‌‌కు వీడ్కోలు చెప్పాలన్న నిర్ణయానికి వచ్చింది. రిటైర్మెంట్‌‌ ఎప్పుడనే దానిపై క్లారిటీ ఇవ్వనప్పటికీ స్వదేశంలో ఈ నెల చివరి నుంచి జరిగే యూఎస్‌‌ ఓపెన్‌‌ ఆమెకు చివరి టోర్నీ కానుంది. ప్రస్తుతం 23 గ్రాండ్‌‌స్లామ్స్‌‌ నెగ్గిన సెరెనా మరోటి గెలిస్తే మార్గరేట్‌‌ కోర్ట్‌‌ 24 మేజర్‌‌ టైటిల్స్ రికార్డును సమం చేస్తుంది.  అయితే యూఎస్‌‌ ఓపెన్‌‌ గెలుస్తానని చెప్పలేని సెరెనా అంటోంది.

మగాడినై ఉంటే కొనసాగేవాడిని..
‘ఈ ఏడాది వింబుల్డన్‌‌ నెగ్గలేకపోయా. న్యూయార్క్‌‌లో (యూఎస్‌‌)లో గెలుస్తానో లేదో కూడా చెప్పలేను. టైటిల్‌‌ కోసం ప్రయత్నం అయితే చేస్తా’ అని సెరెనా పేర్కొంది. కుటుంబం, వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు టెన్నిస్‌‌కు దూరం అవ్వాలని అమెరికా లెజెండ్​ నిర్ణయించుకుంది. తాను మరోసారి తల్లిని కావాలని అనుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఒక అథ్లెట్‌‌గా మాత్రం మరో బిడ్డకు జన్మనివ్వకూడదని డిసైయ్యానని  ఆమెచెప్పింది.  ఒకవేళ తాను అబ్బాయిని అయి ఉంటే తన కెరీర్‌‌ ఇంకొన్నేళ్లు కొనసాగేదని సెరెనా అభిప్రాయపడింది.