అమెరికా చరిత్రలో రికార్డు బ్రేక్ అథ్లెట్ గా నిలిచిన ఫెలిక్స్

అమెరికా చరిత్రలో రికార్డు  బ్రేక్ అథ్లెట్ గా నిలిచిన ఫెలిక్స్
  • అమెరికా స్టార్‌‌‌‌ స్ప్రింటర్‌‌‌‌ అలీసన్‌‌‌‌ ఫెలిక్స్‌

యుజీనా (అమెరికా): అమెరికా స్టార్‌‌‌‌ స్ప్రింటర్‌‌‌‌ అలీసన్‌‌‌‌ ఫెలిక్స్‌‌‌‌.. తన వీడ్కోలు రేస్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో భాగంగా శనివారం జరిగిన 4x400 మీటర్ల మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ రిలేను 3ని. 10.16 సెకండ్ల టైమింగ్‌‌‌‌తో ముగించిన అమెరికా టీమ్​ (గాడ్విన్‌‌‌‌, ఫెలిక్స్‌‌‌‌, నార్‌‌‌‌వుడ్‌‌‌‌, సిమోన్‌‌‌‌) థర్డ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. 36 ఏళ్ల ఫెలిక్స్‌‌‌‌కు ఇదే చివరి మేజర్‌‌‌‌ రేస్‌‌‌‌. వ్యక్తిగత రేస్‌‌‌‌ల్లో ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించలేకపోయిన ఫెలిక్స్‌‌‌‌.. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో బరిలోకి దిగింది. 
పది సార్లు వరల్డ్​చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పోటీపడ్డ ఫెలిక్స్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 19వ మెడల్‌‌‌‌ కాగా, మూడో బ్రాంజ్. ఒలింపిక్స్‌‌‌‌లో 11 మెడల్స్‌‌‌‌ సాధించిన ఫెలిక్స్‌‌‌‌.. అమెరికా ట్రాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ చరిత్రలో  అత్యధిక పతకాలు (30)సాధించిన అథ్లెట్‌‌‌‌గా రికార్డు సృష్టించింది.