ఇండియన్ స్టూడెంట్ గొంతు పిసికిన అమెరికన్

ఇండియన్ స్టూడెంట్ గొంతు పిసికిన అమెరికన్

టెక్సాస్: భారతీయ మూలాలున్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అమెరికా స్టూడెంట్ రెచ్చిపోయాడు. మాటలతో వేధిస్తూ దాడులకు దిగుతూ హింసించాడు. ఈనెల 11న టెక్సాస్ లోని కాపెల్ మిడిల్ స్కూళ్లో ఈ ఘటన జరిగింది. ఇండియన్ స్టూడెంట్ క్యాంటీన్ లో తింటున్న టైంలో వచ్చి.. అతడ్ని వేరే దగ్గరికి వెళ్లాలన్నాడు అమెరికన్ స్టూడెంట్. పక్కన ఖాలీగా ఉన్నచోట కూర్చోవాలని సూచించాడు. అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు అంగీకరించలేదు ఇండియన్ స్టూడెంట్. దీంతో రెచ్చిపోయిన అమెరికన్ స్టూడెంట్...... అతడి మెడ చుట్టూ చేయి వేసి తలను మెలిపెట్టి కుర్చీ నుంచి లాగి నేలపై పడేశాడు. భారతీయ విద్యార్థే మరో స్టూడెంట్ తో గొడవ పెట్టుకున్నాడని అతడ్ని మూడ్రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేయగా... అమెరికన్ స్టూడెంట్ ని ఒక రోజు సస్పెండ్ చేసినట్లు తెలిపాడు స్కూల్ ప్రిన్సిపల్.

ఇండియన్ స్టూడెంట్ తండ్రి కమలేష్ యూఎస్ లో 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. ఈ బాధాకరమైన సంఘటనపై ఆయన స్పందించారు.ప్రిన్సిపాల్ కూడా తమ పిల్లోడి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన స్టూడెంట్ కు ఒక రోజు సస్పెన్షన్ విధిస్తే.. మా అబ్బాయికి మూడు రోజుల సస్పెన్షన్ విధించారని స్కూల్ యాజమాన్యం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్న కూడా షాన్‌దే తప్పు అని స్కూల్ యాజమాన్యం చెప్పడం గమనార్హం అన్నారు. అయితే ఈ స్కూల్ తీరుపై టెక్సాస్‌లో నివసిస్తున్న భారతీయులు సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. భారతీయులకు అమెరికాలో ఫ్రీడమ్ ఎక్కడ ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిజం తెలిసి కూడా తప్పను మన స్టూడెంట్ పై వేయడం దారుణమంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం
కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే
లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం