అమెరికన్ల పాలిట కొత్త హీరో.. ఫౌచీ

అమెరికన్ల పాలిట కొత్త హీరో.. ఫౌచీ

కరోనా బ్రీఫింగ్ తో జనాన్ని ఆకట్టుకుంటున్నఎపిడెమియాలజిస్ట్
టీషర్టులపై, డోనట్లు, కాఫీ కప్పులపైనా ఫౌచీ బొమ్మలు

వాషింగ్టన్: చేదు వార్త అయినా సరే ఆయన దాచకుండా నిజం చెప్తారు. మెత్తగానే అయినా సూటిగా చెప్పేస్తారు. కరోనా లాంటి విపత్తు దేశాన్ని కమ్మేసిన సమయంలో అరవ్థంతంగా మాట్లాడుతూ జనానికి దిశానిర్దేశం చేస్తారు. రోజూ ప్రెసిడెంట్ ట్రంప్ పక్కనే నిలబడి మీడియా ముందుకు వస్తారు. ట్రంప్ నోరు జారినప్పుడల్లా.. చాకచక్యంగా తప్పులను సవరిస్తారు. అందుకు ఆయన ఇప్పుడు అమెరికన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న కొత్త హీరో అయ్యారు. ఆయనే 79 ఏళ్ల సీనియర్ ఎపిడెమియాలజిస్ట్, వైట్ హౌజ్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో కీలక వ్యక్తి డాక్టర్
ఆంథోనీ ఫౌచీ. ‘‘గందరగోళ సమయంలో కూల్ అండ్ కామ్ వాయిస్’’ వినిపిస్తున్న ఫౌచీ పట్ల అమెరికన్లు ఇప్పుడు విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు.

యూత్ తమ టీషర్టులపై ఆయన బొమ్మలు వేయించుకుంటున్నారు. ‘‘మేం ఫౌచీనే నమ్ముతాం’’ అన్న స్లోగన్లు రాయించుకుంటున్నారు. కాఫీ మగ్గులపై ఆయన ఫొటోలను ప్రింట్ చేయించుకుంటున్నారు. చివరకు ఫౌచీ సాక్సులు, క్యాండిల్స్ కూడా వచ్చేశాయట. డోనట్లపై కూడా ఫౌచీ బొమ్మను ప్రింట్ చేయించుకుని, ప్రేమతో తినేస్తున్నారు. ఫౌచీ మ్యానియాను గమనించిన న్యూయార్క్ లోని డోనట్స్ డెలైట్ ఓనర్ నిక్ సెమరారో.. తమ డోనట్లపై ఫౌచీ బొమ్మను ముద్రించి అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ఫౌచీ మానియా ఉందని, అందుకే తాము కూడా దేశ మంతటికీ డోనట్లను సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. మరో రెస్టారెంట్లో ఫౌచీ పౌచీ పేరుతో కాక్ టెయిల్స్ కూడా షురూ అయ్యాయి. ఇక ఎట్సీ అనే వెబ్ సైట్ లో ఏకంగా 3 వేల వస్తువులు ఫౌచీకి డెడికేట్ చేశారట. ఫేస్ బుక్ లో 79వేల మందితో ఫౌచీ ఫ్యాన్
క్లబ్ కూడా నడుస్తోందట. కళ్లనుంచి లేజర్స్ షూట్ చేస్తూ వైరస్ ను చంపే థీమ్ తో ఫౌచీస్ రివేంజ్ అనే వీడియో గేమ్ కూడా రిలీజైందట. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన పట్ల జనం ఇంత అభిమానం చూపడంపై విశ్లేషకులు సర్ ప్రైజ్ అవుతున్నారు.

For More News..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు

రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసులు

దేశంలో 17 వేలు దాటిన కేసులు