
Gold Price Today: నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. భారతదేశంలో బంగారం రేటు గురువారం రోజున స్థిరంగా ఉన్నప్పటికీ.. శుక్రవారం అంటే ఇవాళ అనూహ్యంగా భారీ పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో అందరూ భయపడినట్లుగానే 24 క్యారెట్ల గోల్డ్ రేటు తొలిసారిగా రూ.లక్షా 32వేలను క్రాస్ చేసేసింది రిటైల్ మార్కెట్లో. అస్సలు నిపుణుల నుంచి సామాన్యుల వరకు ఎవ్వరూ కలలో కూడా ఊహించని స్థాయిలకు గోల్డ్ చేరుకోవటంతో అమ్మకాలతో పాటు భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇలా రోజూ తన రికార్డులను తానే గోల్డ్ రేట్లు బద్ధలుకొట్టుకుంటూ ముందుకు సాగటం ఇంకెన్నాళ్లనే ఆందోళనలు పెరగటంతో పాటు ఈ ధరత్రయోదశికి కొనుగోళ్లపై ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు అక్టోబర్ 17న రూ.3330 పెరిగి అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు పరిశీలిద్దాం..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 17న):
హైదరాదాబాదులో రూ.13వేల 277
కరీంనగర్ లో రూ.13వేల 277
ఖమ్మంలో రూ.13వేల 277
నిజామాబాద్ లో రూ.13వేల 277
విజయవాడలో రూ.13వేల 277
కడపలో రూ.13వేల 277
విశాఖలో రూ.13వేల 277
నెల్లూరు రూ.13వేల 277
తిరుపతిలో రూ.13వేల 277
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు అక్టోబర్ 17న గురువారంతో పోల్చితే రూ.3050 పెరుగుదలతో దూసుకుపోతోంది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే..
ALSO READ : ఈ ర్యాలీ నిలిచేనా..?
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 17న):
హైదరాదాబాదులో రూ.12వేల 170
కరీంనగర్ లో రూ.12వేల 170
ఖమ్మంలో రూ.12వేల 170
నిజామాబాద్ లో రూ.12వేల 170
విజయవాడలో రూ.12వేల 170
కడపలో రూ.12వేల 170
విశాఖలో రూ.12వేల 170
నెల్లూరు రూ.12వేల 170
తిరుపతిలో రూ.12వేల 170
ఇక చాలా కాలం తర్వాత వెండి రేట్లు కూడా తగ్గుతూ ఊరటను కలిగిస్తున్నాయి కొనుగోలుదారులకు. దీంతో అక్టోబర్ 17న కేజీకి వెండి రూ.4వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2లక్ష 03వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.203 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.