ఉద్రిక్తతల మధ్య కెనడాలో దీపావళి వేడుకలు.. పార్లమెంట్ పై హిందూ జండా ఆవిష్కరణ

ఉద్రిక్తతల మధ్య కెనడాలో దీపావళి వేడుకలు.. పార్లమెంట్ పై హిందూ జండా ఆవిష్కరణ

దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య కెనాడాలో దీపావళి వేడుకలు జరిగాయి.  కెనడా పార్లమెంట్ పై హిందూ జెండాను ఎగురవేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత ..భారత్ మరియు ఒట్టావా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఈ  సమయంలో కెనడాలో దీపావళి వేడుకలను అక్కడ నివసించే భారతీయులు నిర్వహించారు.

భారతదేశం , కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య ఆదివారం ( నవంబర్ 5)   కెనడాలోఇండో-కెనడియన్ పార్లమెంటేరియన్ చంద్రశేఖర్ ఆర్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఓం అని రాసిన  హిందూ జెండాను కెనడా పార్లమెంట్ పై   ఎగురవేశారు. కర్నాటకకు చెందిన ఆర్య  నిర్వహించిన దీపావళి వేడుకలకు ఒట్టావా, గ్రేటర్ టొరంటో ఏరియా .. మాంట్రియల్ వంటి అనేక కెనడా నగరాల నుండి భారతీయులు భారీగా తరలివచ్చారని ఆయన  చెప్పారు.  కెనడా పార్లమెంట్ హిల్‌పై దీపావళిని నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది. పార్లమెంటుపై హిందూ పవిత్ర చిహ్నం ఓం జెండాను ఎగురవేశామని ఆర్య  X  ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

కెనడా జరిగిన దీపావళి వేడుకలకు 67 హిందూ, కెనడియన్ సంస్థలు మద్దతు ఇచ్చాయని కెనడాలోని 60 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడు ఒకరు చెప్పారు. ఈ ఏడాది (2023)  హిందువుల ఆచారంగా దీపావళి పండుగ జరగడం చాలా ఆనందంగా ఉందంటూ... ఈ కార్యక్రమానికి హాజరైన వాలంటీర్లకు,  సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు  ధన్యవాదాలు తెలిపారు.