అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి: అమిత్ షా

అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి: అమిత్ షా

ఛత్తీస్ గడ్ లో రైస్ స్కాం(బియ్యం కుంభ కోణం), అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. 

ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో సెప్టెంబర్ 2న ప్రచారం నిర్వహించారు. ఆరోప్ పత్ర పేరుతో సీఎం భూపేష్ భఘేల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

గిరిజనులకు ఏం చేశారు..

ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల భూములపై కన్నేసిందని, వారి హక్కులు లాక్కుంటోందని ఆరోపించారు. వారి కోసం ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 

రాష్ట్ర గిరిజనుల కోసం బీజేపీ ప్రభుత్వం 32 శాతం రిజర్వేషన్లు కల్పించిందని , వారి ఆశల్ని అడియాసలు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. 

వారి హయాంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు.  భఘేల్ ప్రభుత్వం అవినీతి రికార్డులన్నీ బద్ధలు కొట్టిందని ఆయన తీవ్రంగా మండి పడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతోందని వివరించారు.