మయన్మార్ సరిహద్దు దగ్గర కంచె వేస్తాం: అమిత్ షా

మయన్మార్ సరిహద్దు దగ్గర కంచె వేస్తాం: అమిత్ షా

ఢిల్లీ : మయన్మార్ సరిహద్దు దగ్గర కంచె వేస్తామన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ సైనికులు కొంతమంది మిజోరం సరిహద్దుల గుండా భారత్లోకి ప్రవేశిసిస్తున్నారు. దీనిపై అప్రమత్తమైన మిజోరాం.. కేంద్రానికి సమాచారం చేరవేసింది. దీంతో కేంద్రమంత్రి అమిత్ షా ఈ మేరకు ప్రకటన చేశారు.  ఇప్ప టివరకు ఇరుదేశాల సరిహద్దుల్లోని ప్రజలు ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ముసుగులోనే వేలాదిమంది మయన్మార్ వాసులు భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. దీనికి ముగింపు పలుకుతామని ఆయన వెల్లడించారు. 

మయన్మార్లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీ జుంటాకు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జుంటాకు, మూడు సాయుధ బృందాలకు మధ్య పోరు జరుగు తోంది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి ప్రవేశించారు.