బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే టైమ్ వచ్చింది : అమిత్ షా

బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే టైమ్ వచ్చింది :   అమిత్ షా

బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా..  ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.  జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అవి ఇవ్వకపోగా .. ఆలయ అభివృద్ధికి  ప్రధాని మోదీ రూ. 70 కోట్లు ఇస్తే వాటిని కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 

కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని అమిత్ షావిమర్శి్ంచారు.  గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ ను కేసీఆర్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు .  గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదన్నారు.  

డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు అమిత్ షా. జరగబోయే ఎన్నికలు భవిష్యత్ ను నిర్ణయించేవాని చెప్పారు. బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు.  బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలని ఆరోపించారు అమిత్ షా.  ఈ రెండూ పార్టీలు బీసీలకు అనుకున్నంత స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు.  

తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించారు అమిత్ షా. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలిపారు.