
గువాహటి: హింసతో కల్లోలంగా మారిన మణిపూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్షా త్వరలో పర్యటించనున్నారు. శాంతి నెలకొనేందుకు అందరూ సహకరించాలని.. ఘర్షణలకు కారణమవుతున్న అంశంలో అన్ని వర్గాలతో చర్చిస్తానని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ఒ వర్గానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. శాంతి యుతంగా ఉండాలని రెండు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న. కొద్ది రోజుల్లో మణిపూర్ వస్తాను. మూడు రోజులు అక్కడే ఉంటాను. శాంతి స్థాపనకు అందరితో మాట్లాడుత” అని అమిత్షా అన్నారు. కాగా, నెలరోజులుగా జరుగుతున్న హింసలో రాష్ట్రవ్యాప్తంగా 70 మందికి పైగా చనిపోయారు. 2వేలకు పైగా ఇండ్లను తగలబెట్టారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.