వచ్చే నెల హుజురాబాద్‌లో అమిత్‌షా పర్యటన

వచ్చే నెల హుజురాబాద్‌లో అమిత్‌షా పర్యటన

హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత హీటెక్కించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినం అయిన సెప్టెంబర్ 17న ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ హైకమాండ్ నేతలు ఇప్పటి వరకు ఎవరూ కూడా అక్కడ పర్యటించలేదు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది.