Cricket World Cup 2023: 100 కోట్ల మంది టార్గెట్ : ఇండియా - పాక్ మ్యాచ్ కు అతిరథమహారథులు

Cricket World Cup 2023: 100 కోట్ల మంది టార్గెట్ : ఇండియా - పాక్ మ్యాచ్ కు అతిరథమహారథులు

వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచుపై రోజు రోజుకీ హైప్ పెరుగుతూనే ఉంది. ఈ మెగా ఈవెంట్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి దాయాదుల మధ్య సమరం ఎప్పుడు చూడాలా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆ రోజు రానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది. 

అక్టోబర్ 14 న జరగనున్న ఈ మ్యాచుకు దేశంలోని పలు స్టార్లు కావడం ఈ మ్యాచ్ పై మరింతగా ఆసక్తిని పెంచుతుంది. బాలీవుడ్ బాడ్ షా అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ  మ్యాచును చూడడానికి వస్తున్నారు. వీరి ముగ్గురికి గోల్డెన్ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు బాలీవుడ్ టాప్ సింగర్ ఆర్జిత సింగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లక్ష 32 వేల మంది సమక్షంలో అతిరథమహారథుల మధ్యలో ఈ మ్యాచ్ జరగనుండడం టోర్నీ మొత్తానికే హైలెట్ కానుంది. 

Also Read : ఇండియా Vs అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మ.2గంటలకు

ఇక ఈ వరల్డ్ కప్ లో నేడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్ తలపడనుండగా ఈ మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంది. మరోవైపు పాక్ నిన్న శ్రీలంకపై గెలిచి నేడు అహ్మదాబాద్ వెళ్లేందుకు పయనమైంది. పాక్ ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి మంచి ఊపు మీద ఉండగా.. భారత్ ఈ మ్యాచులో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది.