అందుకే గోడ దూకేసేవాళ్లం: అమితాబ్

అందుకే గోడ దూకేసేవాళ్లం:  అమితాబ్

నేను ఢిల్లీలోని కిరోరీమల్ కాలేజీ డిగ్రీ చదివాను. అప్పట్లో నేను హాస్టల్‌లో ఉండి చదువుకునే వాణ్ణి. అది ఓ మూలన ఉండేది. గదిలోంచి చూస్తే ప్రహరీ కనిపించేది. సినిమాలు చూసేందుకు మేము గోడ దూకి వెళ్లేవాళ్లం.’ అంటూ తన కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు బిగ్ బీ అమితాబ్(Amitabh Bachchan).

టీవీ షోలతో అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. ఆయన హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి(Kaun Banega Crorepati)లో తన కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే..కాలేజీలో నేను చదివిన రోజులన్నీ నిరుపయోగమైనట్టే..అప్పట్లో నేనేమీ సాధించింది లేదు. నా బీఎస్సీ డిగ్రీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు` అన్నారు. అలహబాద్‌లోని బాయ్స్ హైస్కూల్లో ఆయ‌న స్కూలింగ్ పూర్తి చేశారు. త‌ర్వాత 1962లో డిగ్రీ పూర్తి చేసిన బిగ్ బీ ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి అగ్రశ్రేణి నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ప్రస్తుతం అమితాబ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి మూవీతో పాటు..మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.అలాగే కౌన్  బనేగా కరోడ్‌పతి 15 వ సీజన్ చివరి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.