
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా బ్రాండ్ యాడ్ నుంచి తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ కోసం తీసుకున్న పారితోషికాన్ని కూడా తిరిగి ఇచ్చేసినట్లు వెల్లడించారు. ఈ బ్రాండ్ ప్రమోషన్ సరోగేట్ అడ్వర్టయిజింగ్ కిందకు వస్తుందనే విషయం తనకు తెలియదని చెప్పిన బిగ్ బీ.. ఇకపై పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లతో తనకు సంబంధం ఉండదన్నారు. ఇకపోతే, పాన్ మసాలా యాడ్‌ల నుంచి తప్పుకోవాలని నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ గత నెలలో అమితాబ్‌కు ఓ లేఖ రాసింది. ఉన్నతమైన హోదాలో ఉండి ఇలాంటి యాడ్స్ చేయకూడదని.. పాన్ మసాలా వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని బిగ్‌బీకి సూచించింది. దీంతో అమితాబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.