పేరులో ఖాన్ ఉందనే వెంటపడుతున్నారు

పేరులో ఖాన్ ఉందనే వెంటపడుతున్నారు

న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వడంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఇంటి పేరులో ఖాన్ ఉందనే ఆర్యన్‌ను వేధిస్తున్నారని ఆమె అన్నారు. ఈ ఘటనను ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఉదంతంతో పోల్చిన మెహబూబా.. న్యాయం అపహాస్యం అవుతోందన్నారు. 

‘నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేసి ఆదర్శంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు.. ఓ 23 ఏళ్ల కుర్రాడి వెంటపడుతున్నాయి. అతడి పేరులో ఖాన్ ఉండటంతోనే ఇలా జరిగింది. బీజేపీ తమ కీలకమైన ఓటు బ్యాంక్ కోరికలను తీర్చడానికి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని న్యాయాన్ని అపహాస్యం చేస్తోంది’ అని మెహబూబా ముఫ్తీ ట్వీ్ట్ చేశారు. కాగా, ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఎన్డీపీఎస్ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సోమవారం జరగాల్సిన ఈ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆర్యన్‌తోపాటు ఇతరుల బెయిల్ పిటిషన్లు కూడా వాయిదా పడ్డాయి. 

మరిన్ని వార్తల కోసం: 

‘మా’లో విభేదాలు: ముగిసేనా? ముదిరేనా?

మీరో అద్భుతం.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి

కశ్మీరు‌ లోయలో.. మంచు కురిసే వేళలో..