కోడలు ఐశ్వర్య రాయ్‌ను అన్‌ఫాలో చేసిన అమితాబ్.. కారణమేంటో తెలుసా?

కోడలు ఐశ్వర్య రాయ్‌ను అన్‌ఫాలో చేసిన అమితాబ్.. కారణమేంటో తెలుసా?

బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తన కోడలు ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai)ను ఇన్స్టాగ్రామ్ లో అన్‌ఫాలో చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గమనించిన నెటిజన్స్ అమితాబ్ ఎందుకు ఐశ్వర్య రాయ్‌ను అన్‌ఫాలో చేశారని తెలుసుకోవడానికి సర్చింగ్ మొదలుపెట్టేశారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అమితాబ్ తన ఇన్స్టాలో 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు. అందులో బాలీవడ్ స్టార్స్ ఐశ్వర్య, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ ఉన్నారు. అయితే.. తాజాగా ఆ లిస్టులో ఐశ్వర్య కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఏ కారణంతో ఆయన ఐశ్వర్య ను అన్‌ఫాలో చేశారనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే.. కొంతమంది ఈ వార్తను కొట్టిపారేస్తుంటే.. మరి కొందరేమో అమితాబ్ ఇన్‌స్టా  ఫాలోవర్స్ లో  కొంతమంది పేర్లును బయటకు కనిపించకుండా అకౌంట్ సెట్టింగ్స్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే అమితాబ్ తన మనవడు అగస్త్య నంద నటించిన ది ఆర్చీస్ ప్రీమియర్‌కు హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కుటుంబసమేతంగా హాజరయ్యారు అమితాబ్. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య, అమితాబ్ లు కూడా చాలా సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు.