Amitab Bachchan: అవన్నీ ఫేక్ నమ్మకండి.. ఆరోగ్యపరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్

Amitab Bachchan: అవన్నీ ఫేక్ నమ్మకండి.. ఆరోగ్యపరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్

బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) ఆరోగ్యం పరిస్థితి సరిగా లేదనే వార్తలు గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై స్పదించారు అమితాబ్. తాజాగా ఆయన థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. టైగర్స్ ఆఫ్ కోల్‌కతా, మాఝీ ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి హాజరయ్యారు అమితాబ్‌. దీంతో.. ఆయన్ను ఆరోగ్యం గురించి ప్రశ్నించింది మీడియా.. వాటిపై స్పందించిన అమితాబ్ ఆ వార్తల్లో నిజం లేదని, అవి ఫేక్‌ అని తెలిపారు. ఇక అమితాబ్ ఇచ్చిన క్లారిటీతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఇండియాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా వస్తున్న కల్కి 2898 ఏడీలో కీ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ మరో కీ రోల్ చేస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోందో చూడాలి.