ఒకే ఒక జీవితం నుంచి అమ్మ పాట విడుదల

V6 Velugu Posted on Jan 27, 2022

గతేడాది  శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్.. ఇప్పుడు   ‘ఒకే ఒక జీవితం’ అనే మూవీతో వస్తున్నాడు. శ్రీ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఆర్ ప్రభు నిర్మాత. టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి నిన్న అమ్మ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అఖిల్ రిలీజ్ చేశాడు. ‘అమ్మా వినమ్మా, నేనాటి నీ లాలి పదాన్నే. ఓ అనమ్మా, నేనేనమ్మ. నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే’ అంటూ అమ్మ గురించి హార్ట్ టచింగ్ లిరిక్స్ రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. జేక్స్ బిజోయ్ ట్యూన్ చేశారు. సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇందులో శర్వానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తల్లిగా అమల నటిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్, అలీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని త్వరలోనే  విడుదల చేయనున్నారు.

Tagged Amma song Release, Oke oka Jeevitham, Sharwanand new Movie

Latest Videos

Subscribe Now

More News