
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీప స్థాపన, కలశస్థాపన గాయత్రి ప్రతిష్ఠను అర్చకులు చేపట్టారు. గాయత్రి జపం, గాయత్రి హవనం నిర్వహించారు.
ఉత్సవమూర్తులను హంస వాహనంపై పట్టణంలో ఊరేగించారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.