
జేఎన్టీయూ, వెలుగు : ప్రస్తుతం ఫార్మా ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఉద్యోగాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని జేన్టీయూ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూహెచ్లోని జేఎన్ఆడిటోరియంలో సొసైటీ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషనల్అండ్రీసర్చ్సంస్థ జేఎన్టీయూ సుల్తాన్పూర్ఫార్మసీ కాలేజీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్కాన్ఫరెన్స్నిర్వహించారు.
వీసీ తో పాటు డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ రామకృష్ణ ముఖ్య అతిథలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. మెడికల్, హెల్త్ అంశాలపై కొత్త పరిశోధనలు చేయడమే కాకుండా మందుల ఉత్పత్తి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలకు పుష్కలమైన అవకాశాలు ఫార్మా రంగంలో ఉన్నాయని తెలిపారు.
కొత్తగా తయారు చేసిన మెడిసిన్స్‌ను క్లినికల్ట్రయిల్స్వేసి పలుమార్లు పరిశీలన చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందని డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్రామకృష్ణ సూచించారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 600 మంది ఫార్మా ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్పాల్గొన్నారు.