
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆది, సోమ, మంగళవారాల్లో సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఫర్హాబాద్ సమీపంలో టైగర్స్ కనిపించడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అడవి పచ్చబడడంత పులులు, ఇతర వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సపారీకి వెళ్తున్న వారికి తరచూ పులులు కనిపిస్తున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. -