అమూల్..గుజరాత్ పాలఉత్పత్తి సంస్థ తన ప్రాడక్టులను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇటీవల అమెరికాలో అమూల్ బ్రాంచ్ లను ప్రారంభించింది. తాజాగా యూ రోపియన్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది.
గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ సంస్థ అమూల్ ఇటీవల USలో తన ఉత్పత్తుల అమ్మకాన్ని ప్రారంభించినంది. అక్కడ బిజినెస్ సక్సెస్ కావడంతో ఇప్పుడు యూకె మార్కెట్లోకి ప్రమేశించేందుకు సిద్ధంగా ఉందని GCMMF మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా చెప్పారు.
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచంలో మొత్తం పాలలో మూడింట ఒక పాలను ఉత్పత్తి చేసేందు కు సిద్దంగా ఉందని మెహతా చెప్పారు. పాడి పరిశ్రమ కేవలం వ్యాపారమే కాదు.. గ్రామీణ భారతానికి ఇది జీవనాధారం అని అన్నారు.
Also Read :- పంజాబ్లో కాల్పులు.. ఇద్దరు ఆప్ నేతలకు తీవ్రగాయాలు
యూఎస్ లో ఇటీవల ప్రారంభించిన అమూల్ పాల బిజినెస్ విజయవంతమైంది.మొదటిసారి యూరోపియన్ మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాని మెహతా చెప్పారు. ప్రొటీన్ రిచ్, ఆర్గినిక్,కెమికల్ ఫ్రీ ఉత్పత్తును అందించేందుకు అమూల్ సంస్థ దృష్టి పెట్టిందన్నారు.
అమూల్ సంస్థ ప్రతి రోజులు 310లక్షల లీటర్లపాలను సేకరిస్తుంది. భారత దేశం అంతటా 107 డైరీ ప్లాంట్లు ఉన్నాయి. 50కి పైగా ఉత్పత్తులతో ఏటా 22బిలియన్ ప్యాక్ లు అమ్ముడవుతున్నాయి.
అమూల్ 80వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలమైన డెయిరీ, ఫుడ్ బ్రాండ్ గా ర్యాంక్ ను పొందింది. అమూల్ లో 36 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు.
డాక్టర్ వర్గీయస్ కురియన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. డెయిరీ, ఫుడ్ బ్రాండ్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలి చింది.