రూ.757 కోట్ల ఆమ్​వే ఆస్తుల అటాచ్

రూ.757 కోట్ల ఆమ్​వే ఆస్తుల అటాచ్

మనీ ల్యాండరింగ్‌ కింద ఆమ్​వే ఇండియా ఎంటర్‌ ‌ప్రైజెస్‌కు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. తమిళనాడు దిండిగల్‌లోని ప్లాంట్స్, మిషనరీ, వెహికల్స్, బ్యాంక్ బ్యాలెన్స్​ను అటాచ్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రూ.345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.411.83 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ- లెవల్ మార్కెటింగ్ నెట్‌వర్క్ పేరుతో ఆమ్​వే వ్యాపారం చేస్తోంది.

న్యూఢిల్లీ: మల్టీలెవెల్​ మార్కెటింగ్​ కంపెనీ ఆమ్​వేకు చెందిన రూ.757.77 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశామని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్  ప్రకటించింది.  మల్టీ-లెవల్ మార్కెటింగ్ స్కామ్‌‌‌‌ను నడుపుతున్నందుకు ఈ కంపెనీపై మనీలాండరింగ్​ కేసు పెట్టామని తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తులలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆమ్వే  భూమి,  ఫ్యాక్టరీ బిల్డింగ్​, ప్లాంట్ & మెషినరీలు, వెహికల్స్​, బ్యాంక్ ఖాతాలు,  ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆమ్‌‌‌‌వేకి చెందిన 36   ఖాతాల నుంచి రూ. 411.83 కోట్ల విలువైన స్థిరచరాస్తులను, రూ. 345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌లను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.

డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ-లెవల్ మార్కెటింగ్ నెట్‌‌‌‌వర్క్ ముసుగులో ఆమ్‌‌‌‌వే పిరమిడ్ స్కామ్​ను నడుపుతోందని ఈడీ దర్యాప్తులో తేలింది.  మార్కెట్‌‌‌‌లో లభించే ప్రముఖ బ్రాండ్ల వస్తువులతో  పోలిస్తే కంపెనీ అందించే చాలా ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువ.  ఆమ్​వే జనాన్ని కంపెనీలో సభ్యులుగా చేర్పించి, ఎక్కువ ధరలకు తన వస్తువులను కొనిపిస్తోందని ఈడీ ఆరోపించింది. కొత్త సభ్యులు వాటిని ఉపయోగించడానికి కాకుండా  ఆఫ్‌లైన్ మెంబర్లు మరింత సంపాదించడానికి కొనాల్సి వస్తోందని వివరించింది.