
- ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్లో వెళ్లేందుకు ఒప్పందం
న్యూయార్క్: ప్రపంచంలోనే మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు టూర్ వేసిన అమెరికాకు చెందిన డెన్నిస్ టిటో మరోసారి అంతరిక్ష ట్రిప్‌కు సిద్ధమయ్యాడు. 2001 లో తన సొంత ఖర్చులతో టిటో ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్లొచ్చాడు. ఈసారి చందమామ దగ్గరికి తన భార్యతోపాటు ఇంకో 10మందిని తీస్కపోయొస్తనంటున్నడు. ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ఎక్స్తయారు చేస్తున్న స్టార్‌షిప్‌లో వెళ్లేందుకు పోయినేడు ఆగస్టులోనే టికెట్ బుక్ చేసుకున్నానని గురువారం మీడియాకు వెల్లడించాడు. దీని ప్రకారం వచ్చే ఐదేండ్లలో ఎప్పుడైనా మూన్ దగ్గరికి ప్రయాణించొచ్చని చెప్తున్నాడు. ఇప్పుడే 82 ఏండ్లున్న టిటో ఈలోగా అనారోగ్యంపాలైతే మాత్రం క్యాన్సిల్ చేసుకుంటానని అంటున్నాడు.
అన్నీ కలిసొచ్చి టిటో మూన్ ట్రిప్‌కు వెళ్తే మాత్రం.. 77 ఏండ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికాకు చెందిన జాన్ గ్లెన్ రికార్డును బ్రేక్ చేస్తారు. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్‌లో చంద్రుని దగ్గరికి వెళ్లేందుకు సీటు బుక్ చేసుకున్న తొలి జంట కూడా డెన్నిస్ టిటో దంపతులదే కావడం విశేషం. కాగా, స్పేస్ ఎక్స్ కంపెనీ.. మూన్ మీదికి వెళ్లే రాకెట్‌కు ఇంకా ట్రయల్స్ వేసే పనిలో ఉంది.