జీ–20 సమిట్​ నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్

జీ–20 సమిట్​ నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్​లో జరగబోయే జీ–20 సమిట్​కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. మొత్తం 40 పార్టీల ప్రెసిడెంట్​లకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి భవన్​లో జరగబోయే ఈ మీటింగ్​కు ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్​తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా అటెండ్​ అవుతారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన లోగో, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రం రూపొందించింది. ఇండియా అధికారికంగా డిసెంబర్ 1న జీ–20  ప్రెసిడెన్సీని స్వీకరించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీ–20 సన్నాహక సమావేశాలు ప్రారంభం అవుతాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 200 చోట్ల మీటింగ్​లు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు కేంద్రం తీసుకుంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ–20 సమిట్​ జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతారు. 

టీఎంసీ చీఫ్ హోదాలో దీదీ హాజరు

ఆల్​ పార్టీ మీటింగ్ కోసం వెస్ట్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. తాను తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి హోదాలో అఖిలపక్షం సమావేశానికి అటెండ్​ అవుతున్నానని, సీఎం హోదాలో కాదని తెలిపారు. ఇండోనేసియా రాజధాని బాలీలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ సదస్సు అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. జీ-20 లేదా.. ‘గ్రూప్ ఆఫ్ 20’ అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్గత ఉమ్మడి వేదిక. ఈ జీ20లో ఇండియా, అమెరికా, రష్యా, చైనా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి.