డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌‌‌‌లో వచ్చే నెల 6న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. మీటింగు కు లోక్‌‌‌‌సభ, రాజ్యసభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌‌‌‌లను ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే లెటర్లు పంపారు. భేటీలో లెజిస్లేటివ్ బిజినెస్, తీసుకురాబో యే బిల్లుల లిస్ట్, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే, ఉభయ సభల కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఫ్లోర్ లీడర్‌‌‌‌లను కేంద్రం కోరనుంది. డిసెంబర్ 6న ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్ లో మీటింగ్ జరగనుంది.