ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్ మెడలోంచే..గొలుసు చోరీకి యత్నం

ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్ మెడలోంచే..గొలుసు చోరీకి యత్నం
  •     గన్​తో బెదిరించి గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నం
  •     ఎదురుదాడి చేసి ఇద్దరు దొంగలను పట్టుకున్న ఆఫీసర్.. ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ : ఇద్దరు చైన్ స్నాచర్లు ఏకంగా పోలీస్ స్పెషల్ ఫోర్స్ లో ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్ ఆఫీసర్​నే టార్గెట్ చేశారు. ఈవినింగ్ వాకింగ్ వెళ్లిన ఆయన మెడలోంచి గోల్డ్ చైన్ చోరీకి యత్నించారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎదురుదాడి చేసి ఇద్దరినీ పోలీసులకు పట్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చాణక్యపురి ప్రాంతంలో ఉండే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్​లో ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వినోద్ బడేలా.. దగ్గరలోని నెహ్రూ పార్క్​లో వాకింగ్​చేస్తున్నారు. ఆయన పోలీస్ అని తెలియని ఇద్దరు చైన్ స్నాచర్లు.. గన్ తో వచ్చి బెదిరించారు. 

మెడలోని గొలుసు తీసివ్వాలని, లేదంటే కాల్చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే ఆ ఇద్దరిలో ఒకరు ఆఫీసర్​ ముఖంపై పంచ్ ఇచ్చాడు. వినోద్ కిందపడిపోవడంతో ఆయన మెడలోంచి చైన్ లాక్కుని పరిగెత్తారు. వెంటనే తేరుకున్న ఆ ఆఫీసర్ వాళ్లను వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు కాల్ చేశారు. స్పాట్ కు వచ్చిన పోలీసులు రెండో నిందితుడిని కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, వినోద్ బడేలా ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్​కు నాయకత్వం వహించారు. ఆయన టెర్రరిజం నిరోధక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నారు.