మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రత

 మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రత

 మణిపూర్‌లో భూకంపం సంభవించింది. 2024, జూన్ 12వ తేదీ బుధవారం కమ్‌జోంగ్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. భూకంప కేంద్రం అక్షాంశం 24.72ఎన్, రేఖాంశం 94.25 ఈ మధ్య 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 జూన్ 2న కూడా భూకంపం సంభవించింది.  మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ భూకంప శాస్త్రవేత్తలు చెప్పారు. అక్షాంశం 23.9 ఓన్, రేఖాంశం 94.10 ఈ మధ్య 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపారు.