యానిమేషన్‌‌ నుంచి సినిమాలకు..

యానిమేషన్‌‌ నుంచి సినిమాలకు..

యానిమేషన్ రంగంలో తమదైన గుర్తింపును సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు మరో కొత్త అడుగు వేసింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పేరుతో ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేసి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక మాట్లాడుతూ ‘యానిమేషన్ ఫీల్డ్‌‌లో పలు క్రేజీ ప్రాజెక్టులకు వర్క్ చేశాం. కార్టూన్ నెట్ వర్క్, పోగో, డిస్నీ ఎక్స్‌‌డీల్లో బ్యాంగ్ విక్రమ్ బేతాల్, ది కృష్ణ, చోటా భీమ్ వంటి పలు ప్రోగ్రామ్స్‌‌ చేశాం.

అలాగే  రెండేళ్ల క్రితం గ్రీన్ గోల్డ్ విఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించి గాడ్ ఫాదర్, దసరా, బంగార్రాజు, చార్లి వంటి చిత్రాలకు వర్క్ చేశాం. తర్వాత గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ సంస్థను కూడా ఏర్పాటు  చేశాం. ఇప్పుడు చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై మంచి చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి’ అని  చెప్పారు.