ఉద్యోగం పోయింది.. ర్యాపిడో డ్రైవర్ గా మారాడు.. ఎందుకో తెలుసా?

ఉద్యోగం పోయింది.. ర్యాపిడో డ్రైవర్ గా మారాడు.. ఎందుకో తెలుసా?

సాఫ్ట్ వేర్ రంగంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలగించిన ఉద్యోగులు కొందరు వేరే వైపు జాబ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా మరి కొందరు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. హెచ్ సీఎల్ కంపెనీ నుంచి ఇటీవలే ఫైర్ అయిన ఉద్యోగి శ్రీనివాస్ రాపోలు ది ప్రస్తుతం అదే పరిస్థితి. బెంగళూరులో ఉద్యోగం కోల్పోయిన అతను బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడో  డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

అయితే ఆ పని చేయడం తనని నిరుత్సాహపరచలేదని చెబుతున్నాడు. ర్యాపిడో సాయంతో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పరిచయం పెంచుకుని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడు. జావా చేసిన అతను ర్యాపిడో నడుపుతున్నప్పుడు లవ్ నీష్ ధీర్ అనే ఐటీ ఉద్యోగిని కలిశాడు. ఆ టెక్కీ శ్రీనివాస్ స్టోరీని ట్విటర్ లో షేర్ చేశాడు. జావా డెవలపర్ గా ఉద్యోగాలు ఉంటే తెలియజేయాలని నెటిజన్లను కోరాడు. 'నా దగ్గర శ్రీనివాస్ బయోడెటా ఉంది. జావా డెవలపర్ అయిన అతనికి మీ సంస్థలో ఉద్యోగాలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందనే వస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు పోతుండగా.. ఐటీ కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. డిసెంబర్ నాటికి ఆర్థిక మాంద్యం ప్రభావం తగ్గే సూచనలు కనిపించట్లేదని నిపుణులు చెబుతున్నారు.