మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్

మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని రెండు నెలల క్రితమే లాంఛనంగా పూర్తి చేశారు. ఆ తరువాత విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా వదిలారు మేకర్స్. అయితే ఈ మూవీ గురించి చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఫిలౌతున్నారట. మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్ సంతోషించే ప్రకటన చేశారు. 

సితారా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవర నాగ వంశీ SSMB28 సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 'SSMB28 అప్ డేట్ గురించి మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. అందు కోసం మమ్మల్ని ఎంతగా కామెంట్  చేస్తున్నారో మాకు తెలుసు. సరే ఇప్పడు ఇంక కొంచెం రిలాక్స్ అవ్వండి.. మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఒక ఉత్తేజకరమైన సర్ ప్రైజ్ ఉంటుంది. అది ఈ రోజు సాయంత్రం రాబోతోంది' అంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. 

ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీ ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే ఇవాళ సాయంత్రం రానున్న అప్ డేట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.