
హైదరాబాద్, వెలుగు: ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్‌తో పాటుగా డెయిరీ, ఆర్గానిక్ ఆహార రంగంలో వస్తున్న మార్పుల గురించి చర్చించడం, సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫుడ్ ఎ' ఫెయిర్' పేరుతో గురువారం ఎగ్జిబిషన్ మొదలయింది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (టీఎఫ్‌పీఎస్) డైరెక్టర్ అఖిల్ గవార్ దీనిని ప్రారంభించారు.