ప్రాణం తీసిన వివాహేతర సంబంధం: స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టి చంపారు

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం: స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టి చంపారు

బెంగుళూర్: వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలైంది. క్షణిక సుఖం కోసం వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. తన కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిని దారుణంగా కొట్టి చంపేశారు. స్తంభానికి కట్టేసి గొడ్డును బాదినట్లు బాడటంతో ఆ దెబ్బలు తాళలేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగింది. మహిళ కుటుంబ సభ్యులు వ్యక్తిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. 

వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విష్ణు (27) బీదర్‌ జిల్లాలోని చింతకి గ్రామంలో నివసిస్తున్నాడు. అతడికి పెళ్లై, పిల్లలున్న పూజ అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పూజా తన తల్లిగారింటికి ఇంటికి వెళ్లింది. దీంతో ప్రియురాలిని కలిసేందుకు విష్ణు 2025, అక్టోబర్‌ 21న ఆమె గ్రామానికి వెళ్లాడు. 

ఈ క్రమంలో విష్ణును చూసిన పూజ తండ్రి, ఆమె సోదరుడు అతడిని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. విష్ణుపై పూజ కుటుంబ సభ్యులు విచక్షణరహితంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ ఘటన‎పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.