చార్ ధామ్ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

చార్ ధామ్ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతియేటా నిర్వహించే చార్ ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం మే 14 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇటు దేశంలో.. అటు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా యాత్రలో భాగంగా భక్తులు సందర్శించే నాలుగు ఆలయాల్లోని పూజారులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని సీఎం తీరత్ సింగ్ రావత్ వెల్లడించారు.  

ఈ మధ్యే ముగిసిన కుంభమేళా వల్ల దేశంలో కరోనా విపరీతంగా పెరగాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. మళ్లీ అటువంటి విమర్శలు రాకూడదని ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా యాత్రను రద్దు చేశారు. కుంభమేళా వల్ల ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ 1న రాష్ట్రంలో 2200 కరోనా కేసులుండగా.. ఏప్రిల్ 28 నాటికి అవి కాస్తా 45 వేలు దాటాయి.