అమెరికన్లను కోట్లకు ముంచిన ఇండియన్

అమెరికన్లను కోట్లకు ముంచిన ఇండియన్
  • 4 వేల మంది అమెరికన్లకు ధోకా.. 
  • ఇండియన్​కు 22 ఏళ్ల జైలు

వాషింగ్టన్​: నాలుగు వేల మంది అమెరికన్లను కోటి డాలర్లకు (సుమారు రూ.72.47 కోట్లు) మోసం చేసిన ఓ ఇండియన్​కు అమెరికా కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షెహ్జాద్​ ఖాన్​ (40) అనే వ్యక్తి అహ్మదాబాద్​లో ఓ కాల్​ సెంటర్​ నిర్వహించేవాడు. దాని నుంచి అమెరికన్లకు ఆటోమేటెడ్​ రోబో కాల్స్​ చేయించేవాడు. ఎఫ్​బీఐ అధికారులమని, డ్రగ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అడ్మినిస్ట్రేషన్​ నుంచి ఫోన్​ చేస్తున్నామని, సోషల్​ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్​ అధికారులమని చెప్పి వారిని బెదిరించేవాడు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, జరిమానాలు కట్టాలని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆ నేరం కోర్టులో నిరూపణ కావడంతో జైలు శిక్ష పడింది. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో శిక్ష పడిన నాలుగో వ్యక్తి షెహ్జాద్​. ఇలాంటి మరో కేసులో అమెరికాలో ఉంటున్న మరో ఇండియన్​కు 20 ఏండ్ల శిక్షపడింది. హ్యూస్టన్​లో అక్రమంగా బతుకుతున్న వసీమ్​ మక్నోజియా (37) అనే వ్యక్తి.. టెలీమార్కెటింగ్​ స్కీమ్​లో భాగంగా 2019 ఏప్రిల్​ నుంచి అక్టోబర్​ మధ్య అమెరికన్లను మోసం చేసినట్లు నేరం రుజువైంది. తప్పుడు పేర్లతో 70 డబ్బు పార్శిళ్లను తీసుకున్నాడని, అతడి శిక్షపై డిసెంబర్​లో కోర్టు తీర్పునిస్తుందన్నారు.