సీఎం జగన్‌పై రాయి విసిరిన ఆగంతకుడు.. ఎడమ కంటికి గాయం

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఆగంతకుడు.. ఎడమ కంటికి గాయం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బస్సు యాత్రలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం నిర్వహించిన బస్సు యాత్రలో సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ దగ్గర బస్సు యాత్రలో జనం పూలు జల్లుతూ స్వాగతం పలికారు. గుర్తు తెలియని అగంతకుడు ఎవరో జగన్ పై పూలతో పాటుగా రాయి విసిరారు. 

దీంతో జగన్ ఎడమ కంటికి స్పల్ప గాయం అయ్యింది. కన్ను వాచింది. జగన్ ఎమ్మెల్యే వెల్లపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. వెంటనే వెద్యులు చికిత్స అందించి గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. చికిత్స తర్వాత జగన్ వెంటనే బస్సు యాత్ర ప్రారంభిస్తారు.